అతన్ని ఓకే చేయడానికి అలాంటి చాలా పరీక్షలు పెట్టా... తాప్సి..!

MADDIBOINA AJAY KUMAR
మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది తాప్సి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్నప్పటికీ ఇందులో తాప్సీ తన నటన కంటే కూడా అందాల ఆరబోతతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో ఈమెకు ఈ సినిమా తర్వాత వరుసగా తెలుగు లో అవకాశాలు వచ్చాయి.

అలా చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగించిన ఆ తర్వాత ఈ నటి హిందీ సినీ పరిశ్రమ వైపు ఫోకస్ పెట్టడం , అందులో ఈమెకు వరస క్రేజీ సినిమా అవకాశాలు రావడం జరిగింది. అందులో భాగంగా ఈమె నటించిన చాలా హిందీ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం ఈమె హిందీ లో ఫుల్ బిజీ నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ ముద్దుగుమ్మ డెన్మార్క్ బ్యాట్మెంటన్ ప్లేయర్ అయినటువంటి మదియాస్ ను అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే తాజాగా తన పెళ్లి గురించి తాప్సి మాట్లాడుతూ ... నాది , మదియాస్ ది లవ్ ఏట్ ఫస్ట్ సైట్ కాదు.  నేను మదియాస్ ను ప్రేమించడం కంటే ముందు చాలా మంది తో డేటింగ్ చేశాను. కానీ అతను పరిచయం అయ్యాక , అతనితో మాట్లాడటం మొదలు పెట్టాక నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. అతనిపై నాకు ఎంతో ప్రేమ కలిగింది. ఇక మధియాస్ తో  ప్రేమల పడే ముందు అతనికి కొన్ని పరీక్షలు కూడా పెట్టినట్లు ఈ బ్యూటీ చెప్పింది. తాజాగా తాప్సి తన ప్రియుడి గురించి చెప్పిన మాటలు వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: