విజయంతో కూడిన సవాళ్లు : స్పెషల్ స్టేటస్ తెస్తారా..?

Pulgam Srinivas
2024 వ సంవత్సరానికి సంబంధించిన అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలు కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు జూన్ 4 వ తేదీన విడుదల అయ్యాయి. ఈ ఎన్నికలలో తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేశాయి. ఇక వైసిపి పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కారణంగానో లేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా చీలే అవకాశం లేకుండా చేసిన కారణంతోనో కూటమికి అదిరిపోయే రేంజ్ లో అసెంబ్లీ స్థానాలు , పార్లమెంటు స్థానాలు వచ్చాయి.

దానితో తిరుగులేని శక్తిగా కూటమి ఈ ఎన్నికలలో నిలబడింది. ఇకపోతే గెలుపు వరకు ఓకే కానీ గెలుపు తర్వాత కూటమిపై అనేక సవాళ్లు ఉన్నాయి. అందులో ఒకటి స్పెషల్ స్టేటస్. 2014 వ సంవత్సరంలో తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోవలసి వచ్చింది. ఇక ఆ సమయం నుండే ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ నేతలు , జనాలు కేంద్రం ప్రభుత్వాన్ని అడుగుతూ వస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం అందుకు సానుకూలంగా స్పందించలేదు. ఇకపోతే ఈ సారి ఎన్డీఏ కూటమికి అధికారం వచ్చింది.

కానీ అది సంపూర్ణమైన అధికారం అని చెప్పలేము. ఎందుకు అంటే ఎన్డీఏ కూటమి కి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అన్ని సీట్లు వచ్చాయి. ఒక వేళ కూటమి కనుక తమ సపోర్ట్ ను ఎన్డీఏ కు ఇవ్వని పక్షంలో వారికి వచ్చిన సీట్లలో చాలా శాతం తగ్గిపోతాయి. దానితో వారి బలం చాలా తగ్గుతుంది. ఇదే అదనుగా కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కు స్పెషల్ స్టేటస్ తేవచ్చు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి విజయంతో కూడిన ఈ సవాల్ ను కూటమి ఏ స్థాయిలో ఎదుర్కొంటుందో , వచ్చే ఐదు సంవత్సరాలలోపు స్పెషల్ స్టేటస్ ను ఆంధ్రప్రదేశ్ కి తీసుకు వస్తుందో.. లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: