మృణాల్ నెక్స్ట్ టార్గెట్ కోలీవుడ్... అక్కడ కూడా వర్కౌట్ అయ్యేనా..?

MADDIBOINA AJAY KUMAR
హిందీ సీరియల్స్ ద్వారా కెరియర్ ను మొదలు పెట్టింది మృణాల్ ఠాకూర్. ఇక సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ కి ఆ తర్వాత సినిమా అవకాశాలు దక్కడం మొదలు అయింది . అందులో భాగంగా ఈ బ్యూటీ షాహిద్ కపూర్ హీరో గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన నటన తో , అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టి పడేసింది .

ఇక ఈ మూవీ తర్వాత ఈమెకు హను రాగవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరో గా రూపొందిన సీత రామం అనే తెలుగు సినిమాలో అవకాశం వచ్చింది . ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు ఆ తర్వాత తెలుగు లో అవకాశాలు పెరిగాయి . అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ హాయ్ నాన్న , ది ఫ్యామిలీ స్టార్ అనే తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుం ది.

ఇకపోతే రాఘవ లారెన్స్ హీరో గా మరియు రచన , దర్శకత్వంలో "కాంచన 4" అనే మూవీ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మృణాల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో మృనాల్ తమిళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ బ్యూటీ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే హిందీ , తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: