నందమూరి నట సింహం
బాలకృష్ణ గత కొంత కాలంగా వరుస విజయాలతో ఫుల్
జోష్ లో దూసుకుపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అఖండ
మూవీ కంటే ముందు కొన్ని అపజాయలను ఎదుర్కొన్న
బాలకృష్ణ ఆ
మూవీ తో అదిరిపోయే సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఇక అప్పటి నుండి పరుసగా వీర
సింహా రెడ్డి , భగవంత్
కేసరి సినిమాలతో విజయాలను అందుకొని ఇప్పటికే హైట్రిక్ విజయాలను అందుకున్నాడు.
ఇక ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో
బాలయ్య హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ బాలకృష్ణ కెరియర్ లో 109 వ రూపొందుతుంది. దానితో ఈ
సినిమా యొక్క చిత్రీకరణను "ఎన్ బి కే 109" అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ
మూవీ నుండి మేకర్స్ ఒక చిన్న వీడియోని విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయి అప్డేట్ ను ప్రకటించింది.
ఈ
మూవీ కి సంబంధించిన సూపర్ సాలిడ్ అప్డేట్ ను రేపు అనగా జూలై 10 వ తేదీన ఉదయం 11 గంటల 27 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఓ
పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే వరుస విజయాలతో ఫుల్
జోష్ లో ఉన్న
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న
మూవీ కావడం , వాల్టేరు వీరయ్య లాంటి
బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత
బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న
మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత సూర్య దేవర
నాగ వంశీ నిర్మిస్తున్న ఈ
మూవీ కి ఎస్ ఎస్
తమన్ సంగీతం అందిస్తున్నాడు.