"మనమే" కి 2 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
కొంత కాలం క్రితం ఒకే ఒక జీవితం మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న శర్వానంద్ తాజాగా మనమే అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా , మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా , ఈ సినిమాకు వషిం అబ్దుల్ వహెబ్ సంగీతం అందించాడు. ఇకపోతే జూన్ 7 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి 2 రోజుల్లో నైజాం ఏరియాలో 1.43 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 32 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 1.40 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 2 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.15 కోట్ల షేర్ ... 5.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 2 రోజుల్లో 25 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 45 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 2 రోజుల్లో 3.85 కోట్ల షేర్ ... 7.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 6.15 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: