సిల్క్ స్మిత పై షాకింగ్ కామెంట్ చేసిన కృష్ణవంశీ..!!
ఆ షూటింగ్ లో నేను యాక్టివ్ గా పనిచేయడం సిల్క్ స్మిత గారు చూశారు. ఆ తర్వాత సిల్క్ స్మిత గారు తన సొంత నిర్మాణంలో సినిమా నిర్మించారు. అది వీరవిహారం అనే సినిమా. నన్ను ఆమె తన ప్రొడక్షన్ లో చేర్చుకున్నారు. కొన్ని నెలల పాటు ఆ ప్రొడక్షన్ లోనే వర్క్ చేశా. ఆ విధంగా సిల్క్ స్మిత గారితో మంచి అనుబంధం ఏర్పడింది.ఆమె అందరిని సమానంగా చూసే వ్యక్తిత్వం. కొంతకాలానికి నాకు దర్శకుడిగా అవకాశం వచ్చింది, గులాబీ చిత్రం తెరక్కించా. సినిమా రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. నాకు మంచి పేరు వచ్చింది. ఒక రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో సిగరెట్ కాల్చుతూ నిలుచున్నా. నా ముందే ఒక కారు వెళ్ళింది. అందులో ఎవరున్నారో నేను గమనించలేదు.వెంటనే కారు వెనక్కి వచ్చి నా ముందు ఆగింది. కొంపదీసి ఏఎన్నార్ గారు వచ్చారేమో అని సిగరెట్ కింద పడేశా. కారు అద్దం కిందకి దిగింది. చూస్తే అందులో సిల్క్ స్మిత ఉన్నారు. ఇలా రా అని పిలిచారు. నేను బిక్కి బిక్కుమంటూ వెళ్ళాను. నా తడబాటు చూసి ఏంటి నన్ను గుర్తు పట్టలేదా అని అడిగారు. నేను మిమ్మల్ని గుర్తు పట్టకపోవడం ఏంటమ్మా ? మీకు నేను గుర్తున్నానో లేదో అని ఆలోచిస్తున్నా అని చెప్పా.నేను తీసిన గులాబీ చిత్రం గురించి ఆమెకి తెలిసిపోయింది. సినిమా నేను చూశా. చాలా అద్భుతంగా తీశావ్ అని శుభాకాంక్షలు తెలిపినట్లు కృష్ణ వంశీ గుర్తు చేసుకున్నారు. తన దగ్గర పనిచేసే డ్రైవర్ అయినా, మేకప్ మెన్ అయినా ఆమె సొంత మనిషి లాగే చూసుకునేవారు అని కృష్ణ వంశీ తెలిపారు.