చెంప దెబ్బ కొట్టమని కంగనానే చెప్పిందా.. తెరమిదికి కొత్త విషయం?
అయితే కంగానాపై ఒక కానిస్టేబుల్ ఇలా దాడి చేయడం ఒక ఎత్తైతే ఈ దాడి ఘటనపై ఎంతో మంది ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్న తీరు మరింత సంచలనగా మారిపోతుంది. కొంతమంది కంగనాపై చేయి చేసుకోవడం కరెక్టే అంటూ మద్దతుగా నిలుస్తూ ఉంటే.. మరి కొంతమంది ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో తగదు అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఒక కానిస్టేబుల్ కంగానా చెంపపై కొట్టడం విషయం కు సంబంధించి ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది.
ఏకంగా కంగానా రనౌతే ఇలా చెంపపై కొట్టమని చెప్పిందట. అదేంటి ఆమె ఎందుకు చెబుతుంది అనుకుంటున్నారు కదా. అయితే ఆమె నేరుగా కాదు పరోక్షంగా ఇదే చెప్పిందంటే ఒక వార్త వైరల్ గా మారిపోయింది. గతంలో ఆస్కార్ ఈవెంట్లో భార్యను ఎగతాళి చేస్తూ యాంకర్ మాట్లాడినందుకు ఏకంగా విల్ స్మిత్ అనే హాలీవుడ్ నటుడు ఏకంగా స్టేజ్ పైకి హడావిడిగా వెళ్లి మరి అందరి ముందు యాంకర్ పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటన ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో స్పందించిన కంగనా విల్ స్మిత్ కొట్టడాన్ని సమర్ధించారు. తల్లి చెల్లిపై జోకులు వేస్తే తాను కూడా ఇలాగే చేస్తాను అంటూ కామెంట్ చేశారు. అయితే కంగనాను కొట్టిన కానిస్టేబుల్ కూడా తన తల్లి చేస్తున్న రైతు ధర్నాను ఎగతాళి చేయడం కారణంగానే తాను ఇలా చేయి చేసుకున్నాను అంటూ చెప్పారు. అయితే కంగనానే ఇలా సొంత వాళ్లపై కామెంట్ చేస్తే కొట్టమని చెప్పింది. అందుకే ఆ కానిస్టేబుల్ కొట్టింది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.