అమ్మాయిలు పక్కలోకే పనికొస్తారు.. నిజమే మా నాన్న అనడం తప్పు : రవిబాబు

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులందరి గుండెల్లో నిలిచిపోయిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతోమంది  అలాంటి వారిలో చలపతిరావు కూడా ఒకరు అని చెప్పాలి. ఆయన గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎన్నో వందల సినిమాలో నటించి వైవిద్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యారు. విలన్ గా, హీరోల తండ్రిగా, కామెడీ పంచే కమీడియన్ గా ఇలా ఆయన కెరియర్ లో ఆయన చేసిన పాత్రలు ఎన్నో.

 అలాంటి చలపతిరావు ఇండస్ట్రీలో జరిగిన ఒక పెద్ద వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే  రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చలపతిరావు అమ్మాయిల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి. ఏకంగా అమ్మాయిలు పక్కలో పడుకోవడానికి మాత్రమే పనికొస్తారు అంటూ ఆయన నోరు జారడం వలన ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ వివాదం ఏకంగా చలపతిరావు తుది  శ్వాస విడిచే వరకు కూడా కొనసాగింది. ఇక ఆయన చనిపోయే ముందు తన మాటల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించమని కోరారు చలపతిరావు.

 అయితే తన తండ్రి చలపతిరావు చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఆయన కొడుకు డైరెక్టర్ రవిబాబు నోరు మెదిపింది లేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రవిబాబు ఈ విషయంపై స్పందించాడు. ఇప్పటివరకు నాన్న వివాదం గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. కానీ కొంతమంది నేను మాట్లాడినట్లు యూట్యూబ్లో థంబ్ నెయిల్స్ పెట్టారు. అయితే ఆ వివాదం జరిగినప్పుడు మాత్రం నాన్నతో మాట్లాడాను. మీరు అలా మాట్లాడటం తప్పు. మీరు మాట్లాడిన మాటలు ఇతరులను నొప్పించి ఉంటే సారీ చెప్పడం మీ బాధ్యత అని చెప్పాను. ఆ తర్వాత ఆయన సారీ చెప్పారు. మనందరం ఎప్పుడో ఓసారి నోరు జారేస్తాం  లూస్ గా మాటలు వదిలేస్తాం. కానీ అది తెలుసుకొని సారి చెప్పడం సంస్కారం  మా నాన్న మీడియా ముందు అలా నోరు జారడం ఆయన బ్యాడ్ లక్. సారీ చెప్పి ఆ టాపిక్ ను అక్కడితో అయిపోయింది అని రవిబాబు కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: