ఓటిటి రిలీజ్ డేట్ వచ్చినా కూడా సూపర్ హోల్డ్ ను కనబరుస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించాడు.  సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా , అంజలి ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. మే 31 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 9 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి 9 రోజుల్లో నైజాం ఏరియాలో 3.35 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.64 కోట్లు , ఉత్తరాంధ్ర లో 1.02 , ఈస్ట్ లో 69 లక్షలు , వెస్ట్ లో 53 లక్షలు , గుంటూరు లో 64 లక్షలు , కృష్ణ లో 54 లక్షలు , నెల్లూరు లో 39 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 9 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.80 కోట్ల షేర్ ... 15.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 9 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 65 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 1.15 కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 10.60 కోట్ల షేర్  , 19.60  కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు 10.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 11 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ సినిమా మరో 40 లక్షల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: