మరో బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్న ధమాకా జోడి..!!
మిస్టర్ బచ్చన్ సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వం చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే రవితేజ మరో సినిమాకు ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం చేయనున్నారు. రవితేజ, శ్రీలీల కాంబోలో వచ్చిన ధమాకా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక, ఈ జోడి మళ్లీ తెరపై సందడి చేయనుందంటే అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమం హైదరాబాద్లో చాలా గ్రాండ్గా జరిగింది. వీటికి సంబంధించిన ఫోటోలను చిత్ర యూనిట్ నెట్టింట పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో శ్రీలీల చీరలో ఎంతో అందంగా ముస్తాబయ్యింది.
ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రవితేజకు ఇది 75వ సినిమా కావడంతో ఈ సినిమాను ప్రస్తుతానికి ఆర్టీ75గా పిలుస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ను ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియనుంది. నాగ వంశీకి చెందిన సితార ఎంటర్టైన్మెంట్స్, సాయి సౌజన్య ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ చిత్రానికి భీమ్ సీసిరోలియోనే సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఈయన గతంలో ధమాకాకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.ఇక శ్రీలీల విషయానికి వస్తే మొదటి సినిమాతోనే తన నటనతో మరియు డాన్స్ తో మంచి గుర్తింపును ఏర్పరచుకుంది ఈ చిన్నది. ఇక అతి తక్కువ కాలంలోనే స్టార్ డంను సొంతం చేసుకుంది. దీంతో వరుస సినిమా ఆఫర్లు చుట్టూ ముట్టాయి. ఒకానొక సమయంలో వేరే సినిమా ఒప్పుకునేందుకు కూడా టైం లేనంత బిజీగా ఉంది ఈ బ్యూటీ.