"ఆర్ఆర్ఆర్" హీరోల షూటింగ్ వివరాలు ఇవే..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కియర అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామ్ చరణ్ మరియు మరి కొంత మంది ఇతరులపై రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రాజమండ్రి షెడ్యూల్ తో ఈ మూవీ మొత్తం షూటింగ్ కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృంద భారీ ప్రస్తుతం గోవా లో ఎన్టీఆర్ మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.