పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేశారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ రోజుకు ఒకటి విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. దాదాపుగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఇప్పుడు సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకు వెళుతుంది. హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ గ్రాఫిక్స్ మేకింగ్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇక ట్రైలర్
చూసుకున్నట్లయితే.. కల్కి’ ప్రపంచం ఎలా ఉండబోతోందో చూపించేశారు. ”కావాలంటే రికార్డులు చూసుకో.. ఇప్పటి వరకూ ఒక్క ఫైట్ కూడా ఓడిపోయలేదు, ఇది కూడా ఓడిపోను” అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ హీరోయిటిక్గా, అభిమానులకు నచ్చేలా ఉంది. ప్రపంచానికి ఓ ఆపద వస్తోందని, దాన్ని భైవర ఒక్కడే ఆపగలడని, అదెలా అన్నదే ఈ కథ అని ట్రైలర్ చూస్తే చూచాయిగా అర్థం అవుతోంది. దీపికా పదుకొణె పాత్రనీ బలంగానే డిజైన్ చేశారు. ఆమె పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. అమితాబ్ గెటప్, ఆయన ప్రజెన్స్ అద్భుతంగా కుదిరాయి. కమల్ హాసన్ పాత్రని కూడా ట్రైలర్లోనే పరిచయం చేశారు. ఆయుధాలు, వాహనాలు, యుద్ధాలు… ఇవన్నీ
సరికొత్తగా ఆవిష్కరించారు ఈ సినిమాలో. హాలీవుడ్ సినిమాల స్థాయిలో మేకింగ్ ఉంది. భైరవ పాత్రని ఓ సూపర్ హీరో స్థాయిలో డిజైన్ చేశారు. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ కథలు ఇష్టపడేవాళ్లకు, యాక్షన్ ప్రియులకు ఈ సినిమా బాగా నచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గర్భవతిగా ఉండే దీపికను తీసుకొచ్చేందుకు వెళ్తాడు. ఆమెను కాపాడుతున్న అశ్వత్థామ రోల్ లో ఉన్న అమితాబ్ తో యుద్ధం చేస్తాడు. నువ్విప్పుడు కనబోయేది మాములు ప్రాణం కాదమ్మా, సృష్టిని, నేను కాపాడతానని అశ్వత్థామ దీపికకు చెప్తాడు. ఆ తర్వాత ట్రైలర్ లో దీపిక, ప్రభాస్ మాట్లాడుతున్నట్లు.. అమితాబ్ తో ఓ చిన్న పిల్లవాడు మాట్లాడుతున్నట్లు చూపించారు. దీంతో ఆ పిల్లవాడే కల్కి అయ్యి ఉంటాడని, అతడికి దీపిక జన్మనిచ్చి ఉంటుందని చెబుతున్నారు..!!