విశ్వక్ సేన్ "మెకానిక్ రాఖి" ఆల్ ఇండియా హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు రవి తేజ ముళ్ళపూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఈయన ఈ సినిమాకు కథను కూడా రాశారు. ఇకపోతే రామ్ తాళ్లూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా , జాక్స్ బిజయ్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.
 

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా యొక్క ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పి సంస్థ దక్కించుకున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెకానిక్ రాఖీ సినిమా చిత్రీకరణ దశలోనే ఉంది. ఇంకా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో క్లారిటీ లేదు. అలాగే ఈ మూవీ విడుదల తేదీని కూడా మేకర్స్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.

ఇక ఇంత తొందరగా ఈ సినిమా యొక్క దేశ వ్యాప్త డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ఏషియన్ సురేష్ సంస్థ దక్కించుకుంది అంటే ఈ సినిమా బాగుంది అనే టాక్ ఈ సంస్థ కు అంది ఉంటుంది. అందుకే విరు ఇంత త్వరగా ఈ సినిమా యొక్క ఆల్ ఇండియా థియేటర్ హక్కులను మొత్తం దక్కించుకున్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో , ఈ మూవీ తో యువ నటుడు విశ్వక్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: