ప్రభాస్ పై పొగడ్తలు కురిపిస్తున్న బోల్డ్ బ్యూటి దిశా పటానీ..!!
ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి పొగుడుతూ మాట్లాడింది బోల్డ్ బ్యూటి దిశా పటానీ. "ప్రభాస్ ఒక స్వీట్ పర్సన్. ఆయనతో సినిమాలు చేయడం చాలా సులభంగా, కంపర్ట్‌ఫుల్‌గా ఉంటుంది" అని పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిశా పటానీ తెలిపింది. అలాగే షూటింగ్ మొదటి రోజున ప్రభాస్ తనకోసం మాత్రమే కాకుండా మూవీ టీమ్ మొత్తానికి ఇంటి ఫుడ్ తీసుకొచ్చాడని వెల్లడించింది దిశా పటానీ.దిశా పటానీ ఇంకా మాట్లాడుతూ.. "నేను ఇప్పటివరకు పనిచేసిన మంచి నటీనటులలో ప్రభాస్ ఒకరు. అతను చాలా వినయపూర్వకంగా, మర్యాదగా ఉంటాడు" అని దిశా పటానీ పేర్కొంది. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట్లో, మీడియా వర్గాల్లో వైరల్ అవుతూ హాట్ టాపిక్ అవుతున్నాయి.కాగా ప్రస్తుతం భారతదేశం యావత్ మొత్తం అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రాలలో ముందు వరుసలో ఉన్నది కల్కి 2898 ఏడీ. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌కి నాగ్ అశ్విన్ రచన, దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ప్రధానంగా తెలుగులో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను హిందీలో రీషూట్ చేశారు.క్రీ.శ. 2898లో జరిగిన అపోకలిప్టిక్ అనంతర ప్రపంచంలో ఈ సినిమా కథ నడుస్తుంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్‌గా అనుకుంటున్న ఈ ఫ్రాంఛైజీలో మొదటి విడతగా ఈ సినిమా రానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ టైటిల్ రోల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె అండ్ దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న బిగ్ స్క్రీన్లపైకి రానుంది.