అక్కలు హీరోయిన్స్... చెల్లెలు పెళ్లిళ్లు చేసుకొని సేటిల్డ్..!

MADDIBOINA AJAY KUMAR
ఇప్పటికే ఇండియా సినీ పరిశ్రమలో ఒక ఇంట్లో అక్క సినిమాలలో రాణిస్తూ ఉంటే చెల్లెలు మాత్రం పెళ్లిళ్లు చేసుకొని ఫ్యామిలీతో సెటిల్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు ఎవరు అనే విషయాలను తెలుసుకుందాం.
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె లక్ష్మీ కళ్యాణం మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఆ తర్వాత అనేక విజయవంతమైన సినిమాలలో హీరోయిన్ గా నటించే టాప్ హీరోయిన్స్ స్థానానికి వెళ్ళిపోయింది. ఈమె స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈమె చెల్లెలు అయినటువంటి నిషా అగర్వాల్ కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాలలో కూడా నటించింది. కాకపోతే ఈమె కాజల్ అగర్వాల్ స్థాయిలో ఇండస్ట్రీ లో గుర్తింపును సంపాదించలేదు. దానితో కాజల్ పెళ్లి కంటే ముందే ఈ బ్యూటీ పెళ్లి చేసుకుంది. ఇక ప్రస్తుతం కాజల్ పెళ్లి చేసుకుని కూడా సినిమాలలో నటిస్తుంటే నిషా మాత్రం సినిమాలకు పూర్తి స్థాయిలో దూరంగా ఉంటూ తన కుటుంబం తోనే జీవితాన్ని గడుపుతుంది.

ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో సాయి పల్లవి ఒకరు. ఈమె వరుస సినిమాలలో నటిస్తూ అద్భుతమైన జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉంటే ఈమె చెల్లెలు అయినటువంటి పూజ కన్నన్ కూడా ఇండస్ట్రీ లో ఎదగాలని చాలా ఆశపడింది. కొన్ని ప్రయత్నాలు కూడా చేసింది. కానీ ఈమె సినీ పరిశ్రమలో అంతగా సక్సెస్ కాలేదు. దానితో సాయి పల్లవి పెళ్లి చేసుకోకుండా సినిమాలలో నటిస్తూ ఉండగానే ఈ బ్యూటీ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తన భర్తతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడుపుతుంది. ఇలా మరి కొంత మంది కూడా అక్కలు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతూ ఉంటే చెల్లెలు మాత్రం పెళ్లిళ్లు చేసుకొని ఫ్యామిలీతో లైఫ్ లో సెటిల్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: