అప్పుడు నో.. ఇప్పుడు యస్.. ఇదికదా మజా అంటే..?

MADDIBOINA AJAY KUMAR
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సమయంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆలియా భట్ ను హీరోయిన్గా అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దాదాపు ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో హీరోయిన్గా కన్ఫామ్ అయినట్లు వార్తలు వచ్చాయి.

కానీ అదే సమయంలో ఆలియా గర్భం దాల్చడంతో ఏ సినిమాలో కూడా నటించద్దు అనే ఉద్దేశంతో ఈ సినిమా కథ నచ్చిన ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కూడా ఆ తర్వాత ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ అయినటువంటి జాన్వీ కపూర్ ను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. అలా ఆల్మోస్ట్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా కన్ఫామ్ అయినా ఆలియా లాస్ట్ మినిట్ లో మిస్ అయింది. ఇకపోతే దేవర మూవీ లో అనుకున్న కాంబో వార్ 2 మూవీ లో సెట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ హీరోలుగా వార్ 2 అనే మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో ఆలియా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న వార్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న సినిమా కావడంతో వార్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: