ఇన్నేళ్ల నా కెరియర్లో.. ఇదే బెస్ట్ సినిమా : రకుల్
అయితే గతంతో పోల్చి చూస్తే అటు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గినప్పటికీ బాలీవుడ్ కోలీవుడ్ లో మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలోనే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా మరికొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధమవుతూ ఉండగా.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒక కీలక పాత్రలో నటించింది అన్న విషయం తెలిసిందే. హీరో సిద్ధార్థ్ కి జోడిగా నటించబోతుంది అనేది తెలుస్తుంది.
ఈ క్రమంలోనే భారతీయుడు 2 సినిమా గురించి హీరోయిన్ రకుల్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా ఇన్నాళ్ల తన కెరీర్ లో బెస్ట్ మూవీ అవ్వబోతుంది అంటూ రకుల్ చెప్పుకొచ్చింది ఇందులో క్యారెక్టర్ తన రియల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది ఈ హీరోయిన్. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో తాను ఎప్పుడూ కనిపించలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక శంకర్ లాంటి గొప్ప దర్శకుడు సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అంటూ తెలిపింది. కాగా భారీ అంచనాల మధ్య భారతీయుడు 2 సినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పాలి.