అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా భాక్సాఫీస్ లో దుమ్మురేపింది. నార్త్ లో అయితే ఒక రేంజ్ పెర్ఫార్మన్స్ చేసి తెలుగులో కంటే ఎక్కువ కలెక్షన్లు అక్కడ నుంచే రాబట్టింది.ఇది ఏమాత్రం ఊహించని సినిమా యూనిట్ రెండో భాగాన్ని మరింత పెద్దదిగా, ఇండియా వైడ్ ప్రేక్షకులందరూ ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్ట్ లో రిలీజ్ పెట్టుకున్న వాళ్లంతా ముందు,వెనక అన్నట్లుగా తమ రిలీజ్ డేట్స్ జరుపుకుంటున్నారు. తాజాగా రవితేజ చిత్రం మిస్టర్ బచ్చన్ సైతం తన రిలీజ్ డేట్ ని పుప్ప ను దృష్టిలో పెట్టుకునే ఫిక్స్ చేసిందని సమాచారం. రవితేజ హీరోగా హరీశ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్' . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. రవితేజ స్వతహాగా బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌కు వీరాభిమాని. ఈ నేపథ్యంలో సినిమాకు మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టడం విశేషం. టైటిల్ పోస్టర్లో సైతం ఆయన అమితాబ్ పోజ్‌ను అనుకరిస్తూ కనిపిస్తున్నారు. బాలీవుడ్ లో భారీ హిట్ ను సొంతం చేసుకున్న రైడ్ రీమేక్ చిత్రం ఇది. ఈ సినిమాలో రవితేజ బిగ్ బికి పెద్ద ఫ్యాన్ గా కనిపించబోతున్నారు.
రవితేజ హరీష్ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ్ ను మించిన సినిమా రూపొందుతోందని సమాచారం.. ప్రస్తుతం ఈ సినిమాని వేగంగా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమాను మొదట ఆగస్టు లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆగస్ట్ లో పుష్ప 2 వంటి భారీ చిత్రం ఉండటంతో మరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తవటాన్ని బట్టి డేట్ ని ఫైనల్ చేస్తారు. 'మిస్టర్ బచ్చన్..నామ్ తో సునా హోగా' అని రవితేజ చెప్పిన డైలాగ్ ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయింది. ఈ చిత్రానికి కెమెరా: ఆయనంక బోస్, సంగీతం: మిక్కీ జే మేయర్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, సమర్పణ: పనోరమా స్టూడియోస్, టీ-సిరీస్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన-దర్శకత్వం: హరీశ్ శంకర్.