నెటిజన్స్ కోరిక మేరకు ఫైమా సింగర్ గా మారుతుందా..??
"సింగర్ అవ్వు అక్కా నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం...నీకు బ్రేక్ ఇస్తాం...సింగర్ ఐతే నీకు ఆస్కార్ అవార్డు వస్తుంది" అని అందరూ ముక్తకంఠంతో కోరుతుంటే ఫైమా మాత్రం చాలా సిగ్గు పడుతూ "ఏ ఊకో...మీ అన్న నా పాట విని హాస్పిటల్ లో పడ్డాడు. ఢీ షోలో వాళ్ళు పిలవాలి కదా" అంటూ ఆన్సర్స్ ఇచ్చింది. ఇంతవరకు ఫైమా జబర్దస్త్ లో బులెట్ భాస్కర్ టీమ్ లో లేడీ కమెడియన్ గా ఎంటర్టైన్ చేసింది. మరి తన ఫాన్స్ కోరిక మేరకు ఇప్పుడు ఆమె ఏమన్నా సింగర్ గా ఇండస్ట్రీలో ట్రై చేస్తుందా..లేదా చూడాలి.జబర్థస్త్ ద్వారా ఫైమ ఫేమస్ అయ్యింది. తన మార్క్ పంచ్ లతో.. ప్రేక్షకులను నవ్వించడంతో.. చాలా తక్కువ టైమ్ లోనే ఆమె బాగా ఫేమస్ అయ్యింది. ఇక జబర్థస్త్ ను వీడియ బిగ్ బాస్ లో అడుగు పెట్టిన తరువాత ఇంకా పాపులర్ అయ్యింది ఫైమా. చివరి వారం వరకూ ఉండగలిగి మంచి ఫ్యాకేజ్ ను కూడా తెచ్చుకుంది ఫైమా. అయితే జబర్థస్త్ లో తన లక్ష్యం ఏంటో వివరంగా చెప్పిన ఈ కమెడియన్.. అది నేరవేర్చుకుంది. అది కూడా తన తల్లీ తండ్రుల కోసం చేసింది బ్యూటీ.