పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యి కొంత భాగం పూర్తి కాగానే పవన్ రాజకీయాలపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా గత కొంత కాలంగా పవన్ కేవలం రాజకీయాలపై మాత్రమే దృష్టి పెట్టడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈసారి తెలుగు దేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిపి పోటీలోకి దిగాయి. ఇందులో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచాడు. అలాగే తన పార్టీ నుండి బరిలోకి దింపిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గెలుపొందాడు. దానితో పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే ఉండిపోతారు అని , సినిమా షూటింగ్ లలో పాల్గొనరని ఉస్తాద్ భగత్ సింగ్ మొత్తంగా నిలిచిపోయింది అని అనేక వార్తలు వచ్చాయి.
ఇక ఈ వార్తలకు చెక్ పెట్టేలా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి నిన్న ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. దీని ద్వారానే ఈ సినిమా ఆగిపోలేదు మళ్లీ తిరిగి ప్రారంభం కాబోతోంది అని మేకర్స్ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రీ లీలా హీరోయిన్ గా కనిపించనుండగా , మైత్రి సంస్థ వారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే పవన్ , హరీష్ కాంబోలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.