ప్రభాస్ అభిమానులతో పాటు, యావత్ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ ఎదురు చూస్తున్న సినిమా ‘కల్కి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విదేశాల్లో ఒక రోజు ముందే అంటే జూన్ 26వ తేదీన విడుదల థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా దీపిక పదుకొణె నటిస్తుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. వీరితో పాటు పశుపతి, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వస్తున్న కల్కి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి సినిమా త్రిబుల్
ఆర్ సినిమా రికార్డును బ్రేక్ చేసినట్లుగా తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ విషయంలో ప్రభాస్ కల్కి సినిమా రాజమౌళి అర్ అర్ అర్ సినిమా రికార్డును బద్దలు కొట్టింది. అమెరికాలో అత్యంత వేగంగా వన్ మిలియన్ ప్రీ సేల్స్ జరుపుకున్న భారతీయ సినిమాగా కల్కి సినిమా రికార్డ్ బద్దలు కొట్టింది. రిలీజ్ కు రెండు వారాల ముందే ఈ స్థాయిలో బుకింగ్స్ జరగడంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి. మరి ఇప్పుడే ఈ స్థాయిలో రికార్డ్ బ్రేక్ చేసిన కల్కి సినిమా విడుదలైన తర్వాత ఇంకెన్ని సినిమాల రికార్డును తిరగరాస్తుందో చూడాలి. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!