బాలీవుడ్ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈమె చాలా సంవత్సరాల క్రితం రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది . ఈమె చాలా కాలం నుండి రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్న విషయం మన అందరికీ తెలిసిందే .
అందులో భాగంగా ఈమె తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బి జె పి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి పోటీ చేసిన మొదటి సారే ఎంపీగా గెలిచింది. ఎంపీ గా గెలిచిన తర్వాత ఈమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు . ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె సినిమాలకు , రాజకీయాలకు మధ్య ఉన్న తేడాను వివరిస్తూ... ఏది సులువు , ఏది కష్టం అనే విషయాలను చెప్పుకొచ్చింది . తాజాగా కంగనా మాట్లాడుతూ ... సినిమా రంగం తో పోలిస్తే రాజకీయ రంగం చాలా కష్టమైనది అని ఈమె పేర్కొంది . అదే విధంగా ఒకప్పుడు మా ముత్తాత ఎమ్మెల్యే గా ఉన్నారు . దానితో నన్ను రాజకీయాల్లోకి రావాలి అంటూ అనేక ఆఫర్లు వచ్చాయి.
కానీ ఆ సమయంలో నేను రాజకీయాల్లోకి రావడానికి సరైన సమయం కావాలి అని ఎదురు చూశాను. ఇక చివరకు రాజకీయాల్లోకి వచ్చాను. ఇకపోతే నటుల జీవితం పెద్దగా ఒత్తిడి లేకుండా ఉంటుంది. కానీ రాజకీయాల్లో అలా కాదు. ఎంతో మంది ఎన్నో సమస్యలతో రోజు మన వద్దకు వస్తూ ఉంటారు. వాటిని జాగ్రత్తగా పరీక్షించాల్సి ఉంటుంది అని ఈమె తెలిపింది. ఇకపోతే కంగనా హిమాచల్ లోని మండి నుండి పోటీ చేసి ఎంపీ గా గెలుపొందింది.