ఓటిటిలోనాలుగు భాషల్లో హల్చల్ చేయబోతున్న హర్రర్ మూవీ..!!
మే 3న అటు తమిళంలో ఇటు తెలుగులో అరణ్మనై 4 విడుదలైంది. అయితే ఈ సినిమా తమిళంలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. అయితే, కోలీవుడ్‌లో మాసీవ్ హిట్ అందుకున్న ఈ బాక్ మూవీ తెలుగులో మాత్రం డీలా పడిపోయింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. దీంతో ఇక్కడ ప్లాప్‌గా నిలిచింది.ఇలా రెండు ప్రాంతాల్లో వేరు వేరు ఫలితం అందుకున్న అరణ్మనై 4 ఓటీటీలోకి వచ్చేయనుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. జూన్ 21 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి నాలుగు భాషల్లో బాక్ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. అంటే దాదాపుగా నెలన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చేయనుంది గ్లామర్ హారర్ చిత్రం బాక్.ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలుగులో మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఓటీటీలో చూసేయొచ్చు. సినిమాలో తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ ట్రీట్ అదిరిపోయిందని, అలాగే సస్పెన్స్, హార్రిఫిక్ సీన్స్ మంచి థ్రిల్‌ను పంచాయని తమిళ ప్రేక్షకులు పాజిటివ్‌గా స్పందించారు. అందుకు విభిన్నంగా తెలుగు ఆడియెన్స్ రెస్పాన్స్ ఇచ్చారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.