వారం రోజుల్లో "మనమే" కి వచ్చిన కలెక్షన్స్ ఇవే..!
ఈ మూవీ కి 7 రోజుల్లో నైజాం ఏరియాలో 2.57 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 63 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.76 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 7 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.96 కోట్ల షేర్ ... 11.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 7 రోజుల్లో 50 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 95 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 7 రోజుల్లో 7.41 కోట్ల షేర్ ... 14.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 2.59 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.