హిట్ స్టేటస్ కు అన్ని కోట్ల దూరంలో ఉన్న "మనమే"..!
ఈ మూవీ కి 8 రోజుల్లో నైజాం ఏరియాలో 2.74 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 67 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.93 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 8 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.34 కోట్ల షేర్ ... 12.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 8 రోజుల్లో 52 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 97 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 8 రోజుల్లో 7.83 కోట్ల షేర్ ... 15.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 2.17 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.