ఇక అలాంటి సినిమాలు చేయను.. మరోసారి నొక్కి చెప్పిన ఆర్జీవి?
అలాంటి రాంగోపాల్ వర్మ ఇప్పుడు తీసే సినిమాలు చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు తీసి ఇక ఎంతో మంది డైరెక్టర్లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు మాత్రం ఏకంగా రాజకీయ కక్షలతో కూడిన సినిమాలను తీయడంలో బిజీ అయిపోయారు అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా వైసిపికి అనుకూలంగా టిడిపిని టార్గెట్ చేస్తూ ఆయన తీసిన సినిమాలు ఏపీ రాజకీయాలలో ఎంత దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఎన్ని విమర్శలు వచ్చిన పట్టించుకోకుండా ఆయన ఇలాంటి సినిమాలను తీశారు. అయితే ఇటీవలే ఏపీలో టిడిపి ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో తాను పొలిటికల్ సినిమాలు తీయను అంటూ ప్రకటించి షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. అయితే మరోసారి ఆ మాటను నొక్కి చెప్పాడు. కొత్త దర్శకులను పరిచయం చేసే ప్రెస్మీట్లో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. పొలిటికల్ బయోపిక్ జోలికి వెళ్లేది లేదు అంటూ తేల్చి చెప్పారు. కాగా వర్మ తీసిన వ్యూహం, శపథం లాంటి సినిమాలను అటు చంద్రబాబు లోకేష్‌లను ఉద్దేశించే తీశారు అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే.