మిస్టర్ బచ్చన్ : ఎన్టీఆర్ తో ఢీ అంటున్న రవితేజ..
మాస్ మహారాజ్ రవితేజ,స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు వివేక్ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు .ఈ సినిమా లో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా రైడ్ కు రీమేక్ గా తెరకెక్కింది.ఇదిలా ఉంటే జూన్ 17 న ఈ సినిమా నుంచి షో రీల్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.అలాగే ఈ సినిమాను సెప్టెంబర్ 27 న రిలీజ్ చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఎన్టీఆర్ సినిమా పోటీలో వున్నా కూడా రవితేజ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తుంది.దీనితో ఈ ఇద్దరి స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పేలా లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.