స్టార్ హీరోస్ అవుతారనుకున్న ఈ ముగ్గురి కెరియర్.. నాశనం కావడానికి కారణం అదేనా?
వరుణ్ సందేశ్ : మొదటి సినిమా హ్యాపీ డేస్ సూపర్ హిట్.. ఇక తర్వాత వచ్చిన కొత్త బంగారులోకం యూత్ ఆకట్టుకుని ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీస్ చూశాక అతను స్టార్ అయిపోతారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు తీయలేదు.ఇక కథల ఎంపికలో తడబడ్డాడు. దీంతో చివరికి అతను ఇండస్ట్రీలో కనిపించకుండా పోయాడు.
రాజ్ తరుణ్ : ఉయ్యాల జంపాల సినిమాతో రాజ్ తరుణ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుని మంచి వసూలు సాధించింది. దీంతో రాజ్ తరుణ్ స్టార్ హీరో అవ్వడం పక్క అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలతో పర్వాలేదు అనిపించినా.. కథలు ఎంపిక బాగోలేక చివరికి కెరియర్ని చేజేతులారా నాశనం చేసుకున్నాడు.
ఆది సాయికుమార్ : ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్న సాయికుమార్ నట వారసుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు ఆది. ఇక ప్రేమ కావాలి అనే సినిమాతో మొదటి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎందుకో సక్సెస్ కాలేకపోయాడు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో కనుమరుగైపోయాడు.