బిగ్ బాస్ లోకి ఆ నటిని రప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న స్టార్ మా యూనిట్..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగులో అత్యంత ప్రజాధరణ పొందిన రియాల్టీ షోలలో బిగ్ బాస్ ముందు వరసలో ఉంటుంది. ఇప్పటివరకు తెలుగులో బిగ్ బాస్ బుల్లితెర పై 7,  ఓటిటి పై ఒక సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇప్పటి వరకు కంప్లీట్ అయిన ఈ సీజన్లలో ఒకటి, రెండు సీజన్లకి కాస్త ప్రేక్షక ఆదరణ తగ్గిన చాలా వరకు సీజన్లు ఫుల్ సక్సెస్ అయ్యాయి. బిగ్ బాస్ 6 కి కాస్త ప్రేక్షక ఆదరణ తగ్గింది. దానితో మేనేజ్మెంట్ సీజన్ 7 కి ఉల్టా పుల్టా అనే సరికొత్త కాన్సెప్ట్ ను తీసుకువచ్చి మళ్ళీ షో టిఆర్పి రేటింగ్ ను పెంచింది. తెలుగు బిగ్ బాస్ 1 కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు.

ఆ తర్వాత 3 వ సీజన్ నుండి ఇప్పటివరకు తెలుగులో కంప్లీట్ అయిన అన్ని సీజన్లకి కూడా నాగర్జున హోస్ట్ గా వ్యవహరించాడు. మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతోంది. దీనికి కూడా నాగర్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ మేనేజ్మెంట్ 8 వ సీజన్ కు సంబంధించి కొంత మంది కంటెస్టెంట్లను ఓకే చేసుకున్నారు. కచ్చితంగా ఈ సీజన్లోకి ఇద్దరూ అంతకన్నా ఎక్కువ సీరియల్ హీరోయిన్స్ ను తీసుకోవాలి అని బిగ్ బాస్ బృందం అనుకున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని బుల్లి తెర ప్రేక్షకుల నుండి అద్భుతమైన క్రేజీ ను సంపాదించుకున్న దీపికా రంగరాజు ను ఈ సీజన్లోకి కచ్చితంగా తీసుకురావాలి అని బిగ్ బాస్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు, ఒక వేళ ఈమె కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయితే బిగ్ బాస్ 8 లోకి ఈ బ్యూటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ ఫుల్ జోష్ లో ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి సీరియల్ ను వదులుకొని ఈ బ్యూటీ బిగ్ బాస్ లోకి వెళుతుందో.. లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

dr

సంబంధిత వార్తలు: