ఇయర్ ఫోన్స్ ఎక్కువ వాడితే.. ఆ సెలబ్రిటీకి వచ్చిన వ్యాదే వస్తుందా?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ వార్త తెర మీదకి వచ్చి కూడా అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా  మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ సెలెబ్రెటీల ప్రొఫెషనల్ లైట్ కంటే పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు అందరూ ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఒకప్పుడు సినీ సెలబ్రెటీలు పర్సనల్ విషయాలను ఎంతో సీక్రెట్ గా ఉంచడానికి ఇష్టపడేవారు  కానీ ఏకంగా ఆయా సెలబ్రెటీలు బాధపడుతున్న ఆరోగ్య సమస్యల గురించి సెలబ్రిటీలు అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.

 ఎవరైనా సెలబ్రిటీలు ఇలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అన్న విషయం తెర మీదకి వచ్చింది అంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిగా మారిపోతూ ఉంటుంది. కాగా ఇటీవలే సీనియర్ గాయని ఆల్క యాగ్నిక్ తాను ఒక వినికిడి సమస్యతో బాధపడుతున్నట్లు ఇటీవల షాకింగ్ విషయాన్ని చెప్పింది  న్యూరల్ మెర్క్ సెన్సోరి లాస్ అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు అభిమానులతో చెప్పుకొచ్చింది  కొన్ని వారాల క్రితం విమానం నుంచి బయటకు రాగానే అకస్మాత్తుగా  వినికిడి కోల్పోయాను అంటూ తెలిపింది.  అందుకే అప్పటినుంచి సింగింగ్ కి దూరమయ్యాను అంటూ షాకింగ్ విషయం చెప్పింది. కాగా ఈమె హిందీ తెలుగుతోపాటు 25 కు పైగా భాషల్లో పాటలు పాడింది.

 అయితే సదరు స్టార్ సింగర్ తన సమస్య గురించి చెప్పడంతో హెడ్ ఫోన్స్ వాడితే ఇలాంటి సమస్య వస్తుందా అనే విషయాన్ని సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు ఇంటర్నెట్ జనాలు. ఇదే విషయంపై డాక్టర్ సుధీర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు  ఇది వైరల్ ఇన్ఫెక్షన్  వినికిడి లోపానికి అనేక వైరస్లు కారణం. ఈ ఎన్ టి సర్జన్ క్లినికల్ పరీక్ష చేసి వ్యాధిని నిర్ధారిస్తారు. కొన్ని రోజులు మెడిసిన్స్ వాడితే నయం అవుతుంది. ఇయర్ ఫోన్లని ఎక్కువగా వాడొద్దని అంతే కాకుండా పెద్ద శబ్దాలకు దూరంగా ఉండాలని డాక్టర్ సుధీర్ కుమార్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: