అఫీషియల్ : "కల్కి" రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
ప్రభాస్ తాజాగా కల్కి 2898 ఏడి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , దిశా పటాని కీలక పాత్రలలో నటించగా , కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ , స్వప్న శ్రీనివాస్ బ్యానర్ పై అశ్విని దత్ ఎంతో భారీ బడ్జెట్ తో , ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీని జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను చాలా జోరుగా ముందుకు సాగిస్తున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను లాక్ చేశారు. ఈ మూవీ ని ఏకంగా 179 నిమిషాల 20 సెకండ్ల నిడివి తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ మూవీ దాదాపు మూడు గంటల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంత రన్ టైం తో ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు అంటే ఈ సినిమాలో భారీ ఎత్తున కంటెంట్ ఉండి ఉంటుంది అని జనాలు భావిస్తున్నారు. ఇక ఈ మూవీ పై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో , ఏ రేంజ్ కలెక్షన్ లను చేస్తుందో చూడాలి. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు తగ్గట్టుగా ఈ మూవీ కి కనుక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లు అయితే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఈ మూవీ నుండి ఇప్పటికే అనేక ప్రసార చిత్రాలను విడుదల చేయగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటి ద్వారా ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: