టాలీవుడ్ క్రేజీ మూవీస్ లేటెస్ట్ షూటింగ్ వివరాలు ఇవే..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలు అయినటువంటి రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ , నాని , నాగ చైతన్య చిరంజీవి ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం వీరు ఏ సినిమాల్లో హీరోలుగా నటిస్తున్నారు. ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతుంది అనే వివరాలను తెలుసుకుందాం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం హైదరాబాదు లో ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఎన్టీఆర్ మరియు మరియు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వి కపూర్ పై థాయిలాండ్ లో ఓ డ్యూయెట్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అని పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.  ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు "బీ హెచ్ ఈ ఎల్" లో ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.
నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో నాగ చైతన్య మరియు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సాయి పల్లవి పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం హైదరాబాదు లోని అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి మరియు మరి కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: