"మనమే" తో మరో విజయాన్ని అందుకోబోతున్న శర్వా...13 రోజుల కలెక్షన్స్ ఇవే..?

Pulgam Srinivas
గత కొంతకాలంగా వరుస అపజయాలను ఎదుర్కొన్న శర్వానంద్ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి ఒకే ఒక జీవితం సినిమాతో మంచి విజయాన్ని అందుకొని మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఒకే ఒక జీవితం విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న శర్వానంద్ తాజాగా మనమే అనే సినిమాలో హీరోగా నటించాడు. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించాడు. శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూన్ 7 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.
13 రోజులు ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.53 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 86 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 3.71 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 13 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.10 కోట్ల షేర్ ... 15.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 13  రోజుల్లో 58 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 1.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 13 రోజుల్లో 9.78 కోట్ల షేర్ ... 19.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 22 లక్షల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: