కల్కి రిలీజ్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది!పాన్
ఇండియా స్టార్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్
డైరెక్టర్ మహానటి లాంటి సినిమాతో బిగ్గెస్ట్
బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్
మూవీ కల్కి 2898AD.
జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ వరల్డ్
మూవీ పై ప్రేక్షకుల్లో ఇంకా అలాగే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
బాలీవుడ్ లో మంచి ఫాంలో దూసుకుపోతున్న దీపికా పదుకునే,
దిశా పటాని వంటి హాట్ బ్యూటీలు ఈ సినిమాలో
హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే
ఇండియన్ సినిమా లెజండరి హీరోస్
తమిళ స్టార్ యూనివర్సల్ స్టార్
హీరో కమల్ హాసన్,
బాలీవుడ్ మెగాస్టార్
అమితాబ్ బచ్చన్ లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ
మూవీ రిలీజ్ ట్రైలర్ పై మేకర్స్ తాజాగా ఒక ప్రకటన చేయడం జరిగింది. రేపు సాయంత్రం 6:00 గంటలకు రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఇదే విషయాన్ని సరికొత్త
పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు.ఈ సినిమాలో సీనియర్ నటులు అయిన రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం,
పశుపతి తదితరులు నటిస్తున్నారు.ఈ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ చిత్రానికి
తమిళ స్టార్ మ్యూజిక్
డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ
సినిమా నుంచి ఇప్పటి దాకా విడుదల అయిన గ్లింప్స్, పోస్టర్స్ బుజ్జి టీజర్ ఇంకా ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సినిమా పై అంచనాలని విపరీతంగా పెంచేసాయి. ఖచ్చితంగా ఈ
సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాని
టాలీవుడ్ సీనియర్
ప్రొడ్యూసర్ అయిన
అశ్విని దత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ
సినిమా ఖచ్చితంగా 2000 కోట్ల వసూళ్ళని కలెక్ట్ చేస్తుందని
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ భావుస్తున్నారు.