శృతిహాసన్ పై వచ్చిన రూమర్స్ కు చెక్ పెట్టిన గౌతమి..?
‘‘నేను ఆయనతో కూర్చొని మాట్లాడి నా నిర్ణయం చెప్పడంకంటే ముందే ఆ పోస్ట్ చేసేశాను. నేను పూర్తిగా క్లారిటీతోనే ఆ పనిచేశాను. కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, వదిలేయడానికి నాకు చాలా సమయం పడుతుంది. అలా నేను ఇలా చేస్తేనే నా జీవితానికి నేను న్యాయం చేయగలుగుతాను, నా బిడ్డకు మంచి తల్లిగా ఉంటాను అనుకున్న తర్వాత అన్నీ వాటంతట అవే జరిగిపోయాయి. తర్వాత కూర్చొని బాధపడడం లాంటిది ఏం జరగలేదు. అదంతా ముందే అయిపోయింది, చాలాకాలంగా అవుతూనే ఉంది. జీవితాంతం అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అలా జరగకపోతే తప్పకుండా బాధ కలుగుతుంది’’ అని తెలిపారు గౌతమి. ఇక కమల్‌పై ప్రేమ ఎలా కలిగింది అని అడగగా.. తనను ఎప్పుడూ ఒక నటుడిగా గౌరవించానని, ఇద్దరం ఒకనొకరం గౌరవించుకునే క్రమంలోనే ప్రేమ పుట్టిందని అన్నారు.శృతి హాసన్ వల్లే గౌతమి, కమల్ హాసన్ విడిపోయారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. దానిపై గౌతమి స్పందిస్తూ.. తన జీవితంలో తాను తీసుకున్న నిర్ణయాలకు తానే బాధ్యత వహిస్తానని, వేరేవాళ్ల వల్ల ఒక నిర్ణయం తీసుకుంటే ఆ రిలేషన్‌షిప్‌కు విలువ ఉండదని తెలిపారు. తనకు క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయిన వెంటనే తానే స్వయంగా వీల్ చైర్లో వెళ్లి శృతి హాసన్‌ను అమెరికాలోని కాలేజ్‌లో జాయిన్ చేసి వచ్చానని గుర్తుచేసుకున్నారు. కమల్ హాసన్‌కు వేరే అమ్మాయితో అఫైర్ ఉండడం వల్లే బ్రేకప్ అయ్యిందనే వార్తపై కూడా గౌతమి స్పందించారు. తన రిలేషన్షిప్ దూరం అయిపోవడానికి మూడో మనిషి కారణం కాదని, మనుషులే మారారని అన్నారు. తనే మారిందని కూడా ప్రేక్షకులు అనుకోవచ్చు అని సమాధానమిచ్చారు గౌతమి. ఆ నిర్ణయం వల్ల తాను కూడా బాధపడ్డానని తెలిపారు.