తెలుగులో "మహారాజా" కి మాస్ కలెక్షన్స్... విజయ్ సేతుపతి అస్సలు ఆగట్లేదుగా..?
ఈ 8 రోజుల్లో ఈ సినిమాకి నైజాం ఏరియాలో 1.93 కోట్లు కలెక్షన్లు దక్కగా, సీడెడ్ లో 72 లక్షలు , ఆంధ్ర లో 1.65 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 8 రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 4.30 కోట్ల షేర్ , 8.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని 80 లక్షల లాభాలను అందుకుంది. ఇలా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తూ ఫుల్ జోష్ లో ముందుకు సాగుతుంది. ఈ వీక్ లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో మనమే నుండి కాస్త పోటీ ఎదురవుతున్న వేరే ఏ సినిమా కూడా పోటీ ఇవ్వకపోవడంతో మహారాజా చిత్రం ఈ వారంలో మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది.