రెబల్ స్టార్
ప్రభాస్, నాగ్ ఆశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'కల్కి2898ఏడి'. ఈ
సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై సీనియర్
నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో దీపికా పదుకొణె,
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,
దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో
ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా సినీ ప్రియులు
కల్కి విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు
జూన్ 27 వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా,
మూవీ టికెట్ ధరలు పెంపునకు మేకర్స్
తెలంగాణ ప్రభుత్వంను అనుమతి కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినీ ప్రియులకు కోలుకోలేని షాకిచ్చింది. సింగిల్ స్క్రీన్‌పై రూ. 75, మల్టీఫ్లెక్స్‌లో రూ. 100 చొప్పున ధరలు పెంచుకోవచ్చని తెలిపినట్లు సమాచారం తెలుస్తుంది.
అయితే
జూన్ 27 ఉదయం పడే బెనిఫిట్ షోకు మాత్రం రూ. 200 పెంపు అదనంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే
తెలంగాణ ప్రభుత్వం
కల్కి టీంకి ఐదు రోజుల పాటు రోజుకు ఐదు షోలు వేసుకునేలా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో
కల్కి 2898 ఏడి మూవీకి ఫుల్ సపోర్ట్ లభించినట్లు అయింది. ఈ లెక్కన చూస్తే
కల్కి మూవీ బెనిఫిట్ షోకు సింగిల్ స్క్రీన్‌పై రూ. 377, మల్టీఫ్లెక్స్‌లో రూ. 495 ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా రోజుల్లో సింగిల్ స్క్రీన్‌పై రూ. 265, మల్టీఫ్లెక్స్‌లో రూ. 413 అలాగే ఆన్లైన్లో త్రీడి గ్లాస్ చార్జీలు కలిసి ఒక్క టికెట్ ధర ఏకంగా రూ. 500 ఖర్చు అవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన
డార్లింగ్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. టికెట్ ధరలు ఈ రకంగా పెంచితే మిడిల్ క్లాస్
పీపుల్ ఖచ్చితంగా ఓటిటిలో మాత్రమే చూస్తారు. ఒకవేళ ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే
బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల జాతర మాత్రం మాములుగా ఉండదు. ఈ సినిమాకి మొత్తం 388 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
సినిమా హిట్టు కొట్టాలంటే ఖచ్చితంగా 400 కోట్ల షేర్ రాబట్టాలి.