హాలీవుడ్ వద్దు టాలీవుడ్ ముద్దు అంటున్న సల్మాన్ భాయ్?

Purushottham Vinay
హాలీవుడ్ వద్దు టాలీవుడ్ ముద్దు అంటున్న సల్మాన్ భాయ్?


హిందీ చిత్ర పరిశ్రమని ఏలుతున్న టాప్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. కానీ ఇటీవల ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడట్లేదు.వరుస ప్లాపులు ఎదురుకుంటున్నారు. స్పై యాక్షన్‌ మూవీస్‌తోనే ఎక్కువగా రావడంతో నార్త్ ఆడియెన్స్ ఆయన సినిమాలని తిరస్కరిస్తున్నారు. ఇక హిందీలో చాలా వరకు అలాంటి సినిమాలే రావడంతో వాటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.దీంతో వరుస పరాజయాల చవి చూస్తున్నారు సల్మాన్‌ ఖాన్‌. అయితే ఆయన ఇటీవల సౌత్‌ పై ఫోకస్‌ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్‌`లో కోమియో రోల్‌లో మెరిశాడు. తెలుగు ఆడియెన్సని అలరించారు. అంతకు ముందు `దబాంగ్‌ 3 సినిమా ప్రమోషన్స్ కోసం కూడా హైదరాబాద్‌ వచ్చాడు. ఆ మధ్య కిసి కా భాయ్‌ కిసి కి జాన్‌ మూవీలో తెలుగు హీరోలు వెంకటేష్‌, రామ్‌ చరణ్‌లను నటింపచేశారు.


అయితే సౌత్‌లో ముఖ్యంగా టాలీవుడ్ లో పాగా వేసేందుకు ఆయన ఇలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనిపిస్తుంది.ఈ నేపథ్యంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  హీరోలు అందరు కూడా ఇప్పుడు హాలీవుడ్‌కి వెళ్లాలనుకుంటున్నారు. తాను మాత్రం సౌత్‌కి వెళ్లాలనుకుంటున్నాను అని సల్మాన్ భాయ్ వెల్లడించాడు. ఇప్పుడు ఏదైనా సినిమా మీదనే నడుస్తుంది. ముఖ్యంగా కలెక్షన్లే మెయిన్‌ అయ్యాయి. సౌత్‌లో సినిమాలు చూస్తున్నారు, నార్త్ లో చూస్తున్నారు, మనకు చాలా థియేటర్లున్నాయి ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎదుగుతున్నారు. ఇంకా నెంబర్స్ కూడా చాలా పెరిగిపోయాయి` అంటూ వెల్లడించారు సల్మాన్‌ ఖాన్‌. ఓ సినిమా ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. మొత్తంగా సల్మాన్‌ ఖాన్‌ సౌత్‌ ఆడియెన్స్ కి దగ్గర కావాలని, సౌత్‌లో సినిమాలు చేయాలని చూస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: