మెగాస్టార్ విశ్వంభర సెట్స్ లో ఆ స్టార్ డైరెక్టర్.. ఈ ఫోటో వెనుక అసలు నిజం అదేనా..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న సినిమా విశ్వంభర. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్స్ తో జరుపుకుంటున్న సమయంలో అక్కడికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్  వచ్చారు.ఆ సందర్భంగా చిరుతో ఆయనకు ఉన్న ప్రత్యేకమైన అనుబంధాన్ని పంచుకుంటూ కొద్దిసేపటివరకు మాట్లాడుకున్నారు వివి వినాయక్, చిరంజీవి. ఆ తర్వాత చిత్ర యూనిట్ కి,డైరెక్టర్ విశిష్ట కి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. మెగాస్టార్, వశిష్ట ,వివి వినాయక్ కలిసి ఫోటో కూడా  దిగారు.తాజాగా ఇప్పుడు వీళ్ళు ముగ్గురూ కలిసి

 దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక చిరంజీవి తాజాగా నటిస్తున్న సినిమా  విషయానికి వస్తే. వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తుండగా విక్రమ్, వంశీ, ప్రమోద్, ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ లోనే అతిపెద్ద సినిమా గా వస్తున్న ఇందులో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీకి ఆస్కార్ అవార్డు అందుకున్న ఎం ఎం కీరవాణి

 అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కబోతున్న ఈ సినిమాను 2025 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.ఇక గ‌తంలో మెగాస్టార్ చిరంజీవితో ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబ‌ర్ 150’ వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన వివి.వినాయ‌క్, ప్ర‌స్తుతం త‌న నెక్ట్స్ ప్రాజెక్టుల‌పై ఫోక‌స్ పెట్టారు. ఖైదీ నంబర్ 150, సైరా చిత్రాలకు పనిచేసిన.. రచయిత సాయి మాధవ్ బుర్రా .. స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. విశ్వంభర.. చిరంజీవి కెరీర్ లోనే.. అత్యద్భుత.. దృశ్యకావ్యంగా మలిచేందుకు చిత్ర నిర్మాతలు అహర్నిశలూ.. కృషి చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: