అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మలయాళ సినిమా ప్రేమమ్ మూవీతో మంచి విజయాన్ని, గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన “అ ఆ” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం, ఇందులో ఈమె పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో అనుపమకు వరుసగా తెలుగులో అవకాశాలు రావడం మొదలు అయింది.ఆ తర్వాత శర్వానంద్ సరసన ‘శతమానం భవతి’ మూవీతో టాలీవుడ్‌లో ఫేమస్ అయిపోయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది. కెరీర్ మొదట్లో ఎంతో సంప్రదాయబద్ధంగా లంగా ఓణీలో కనిపించి యువతను ఆకట్టుకున్న అనుమత తన స్టైల్ మార్చేసింది. ‘రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్’ మూవీలో తనలోని మరో యాంగిల్ ఇంట్రడ్యూస్ చేసింది. బోల్డ్, లిప్ కిస్ సీన్స్‌లో నటించి అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే.. టిల్లు స్క్వేర్ మూవీలో అనుపమ నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ.. బ్యూటీ లుక్‌కు డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం తెగ హర్ట్ అయ్యారు. టిల్లు స్క్వేర్ విషయంలో మొదటి నుంచి కూడా అనుపమను మెజార్జీ జనం ఇష్టపడటం లేదు. అనుపమ ఏంటి? ఇలాంటి పాత్రలు చేయడం ఏంటి? అని ఆశ్చర్యపోయారు. కొందరు అయితే ఏకంగా అనుపమ మీద తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. 'నీలో ఓ సావిత్రిని, సౌందర్యను చూసుకున్నాం. ఇప్పుడు నువ్వు ఇంతలా మారిపోయి .. బోల్డ్ సీన్స్ చేస్తూ.. గ్లామర్ డోస్ పెంచేస్తే తట్టుకోలేకపోతున్నాం’ అంటూ కామెంట్స్, వీడియోస్‌తో నెటిజన్లు రచ్చరచ్చ చేస్తున్నారు. అయితే.. ఇలా ఫ్యాన్స్ నిరుత్సాహం చెందడంతో.. ఎక్కడికి వెళ్లిన అనుపమకి గ్లామర్ రోల్స్‌పై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ స్పందించింది. ‘నేను కెరియర్ ప్రారంభంలో డీసెంట్ పాత్రలలో నటించాను. ఇప్పుడు గ్లామర్ పాత్రలు చేస్తున్నాను. అలా ఎందుకు చేస్తున్నానా అని చాలామంది అనుకుంటున్నారు. ఒకే రకం పాత్రల్లో నటిస్తే బోర్ కొడుతుంది. అలాగే నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకొని అవకాశం కూడా లేకుండా పోతుంది. అందుకే డిఫరెంట్ పాత్రలలో నటిస్తున్నాను. కేవలం క్లాస్ పాత్రల్లోనే కాదు, అన్ని రకాలైన పాత్రల్లో నటించాలి అనేది నా ఉద్దేశం’ అంటూ చెప్పుకొచ్చిన అనుపమ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.