ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రి రిలీజ్ బిజినెస్ లు జరుపుకున్న టాప్ 10 తెలుగు మూవీలు ఏవి. అందులో
కల్కి సినిమా ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.
రాజమౌళి దర్శకత్వంలో
రామ్ చరణ్ ,
జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్
మూవీ 450 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొని మొదటి స్థానంలో నిలిచింది. ఈ
మూవీ తర్వాత
ప్రభాస్ హీరోగా రూపొందిన
కల్కి 2898 ఏ డి
సినిమా ప్రపంచ వ్యాప్తంగా 385 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని 2 వ స్థానంలో ఉంది. ఈ సినిమాను రేపు అనగా
జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి. ఇక ఈ
మూవీ తర్వాత
ప్రభాస్ హీరోగా
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన
బాహుబలి 2
సినిమా 352 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని 3 వ స్థానంలో నిలవగా , ఆ తర్వాత
ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్
సినిమా 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో 4 వ స్థానంలో నిలిచింది.
ప్రభాస్ హీరోగా రూపొందిన
సాహో సినిమా ప్రపంచ వ్యాప్తంగా 270 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని 5 వ స్థానంలో నిలవగా ,
ప్రభాస్ హీరోగా రూపొందిన
ఆది పురుష్
సినిమా 240 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని 6 వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కూడా
ప్రభాస్ హీరోగా రూపొందిన రాదే
శ్యామ్ సినిమా 202.80 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని 7 వ స్థానంలో నిలవగా , ఆ తర్వాత
మెగాస్టార్ చిరంజీవి హీరోగా
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన
సైరా నరసింహా
రెడ్డి సినిమా 187.25 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ తో 8 వ స్థానంలోనూ ,
అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప
మూవీ 144.9 కోట్ల రిలీజ్ బిజినెస్ తో 9 వ స్థానంలోనూ , మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం
మూవీ 132 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో 10 వ స్థానంలోనూ నిలిచింది.