కల్కి 2898 AD : ప్రభాస్‌కు కోడిగుడ్డు అమ్మిన రాంగోపాల్ వర్మ... ఎన్ని వేలో తెలుసా..?
మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ అనే కాన్సెప్ట్ జోడించి ఇక తన విజన్ తో నాగ్ అశ్విన్ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా గురించి చర్చ జరుగుతుంది. అయితే ఈ మూవీలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఒక కీలకపాత్రలో నటించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వర్మ ఏ పాత్రలో నటించాడు అని తెలుసుకోవడానికి ఆయన అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురు చూసారు. విడుదలైన తర్వాత సినిమా చూసి వర్మ పాత్రతో అభిమానులు సర్ప్రైజ్ అయిపోతున్నారు.
ఎందుకంటే ఈ సినిమాలో రాంగోపాల్ వర్మ ప్రభాస్ కి గుడ్డు అమ్మాడట. ఈ సినిమా మొత్తం కాంప్లెక్స్ కి వెళ్లాలని ప్రభాస్ అనుకుంటూ ఉంటాడట. దీనికోసం యూనిట్స్ అవసరం కాగా.. ఇక పదివేల యూనిట్స్ సంపాదించుకోవడం క్రమంలో రాంగోపాల్ వర్మను కలుస్తాడట నీకు ఒక అపురూపమైన వస్తువును ఇస్తాను ఐదువేల యూనిట్లు కావాలని అడగడంతో.. ప్రభాస్ ఆ మాట నమ్మి ఆర్జీవికి 5 యూనిట్స్ ఇచ్చి బాక్స్ లో పెట్టిన ఒక అపురూపమైన వస్తువును కొంటాడట. పక్కకు వెళ్లి చూస్తే అది కోడుగుడ్డు. దీంతో మోసపోయానని ప్రభాస్ గమనిస్తాడట. ఇలా వర్మ సినిమాలో గెస్ట్ అఫీరియన్స్ పాత్రలో ప్రభాస్ కు ఏకంగా గుడ్డుని అమ్మేశాడు.