రెబల్ స్టార్
ప్రభాస్ కి నైజాం ఏరియాలో అదిరిపోయే
మార్కెట్ ఉంది. ఈయన నటించిన సినిమాలకు నైజాం ఏరియాలో హిట్ , ఫ్లాప్ లతో ఏమాత్రం సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అదే సినిమాకు గనక హిట్ టాక్ వచ్చినట్లు అయితే ఆ కలెక్షన్లు మరింత జోరుగా వస్తూ ఉంటాయి. ఇకపోతే తాజాగా
ప్రభాస్ "కల్కి 2898 AD" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీపై మొదటి నుండి నైజాం ప్రేక్షకులు అత్యంత ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. దానితో ఈ
మూవీ కి నైజాం ఏరియాలో ఏకంగా 70 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ
సినిమా నైజాం ఏరియాలో అత్యంత పెద్ద టార్గెట్ తోనే
బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజు నైజాం ఏరియాలో 19.60 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. మరి ఈ
మూవీ నైజం ఏరియాలో మొదటి రోజు కలెక్షన్ల విషయంలో 3 వ స్థానంలో నిలిచింది. ఈ
మూవీ కంటే ముందు వరుసలో
రామ్ చరణ్ ,
జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్
సినిమా 23.35 కోట్ల షేర్ కలెక్షన్లతో మొదటి స్థానంలో ఉండగా , ఆ తర్వాత
ప్రభాస్ హీరోగా
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్
మూవీ 22.55 కోట్ల షేర్ కలెక్షన్లతో 2 వ స్థానంలో నిలిచింది.
ఇక 3 వ స్థానంలో
కల్కి సినిమా 19.60 కోట్ల కలెక్షన్లతో నిలిచింది.
కల్కి మూవీ కి
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా , ఈ
మూవీ లో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , కమల్ హాసన్ , దిశ పటానీ , బ్రహ్మానందం ,
శోభన , మృనాల్ ఠాకూర్ ,
రాజేంద్ర ప్రసాద్ ,
దుల్కర్ సల్మాన్ ,
విజయ్ దేవరకొండ ,
ఎస్ ఎస్ రాజమౌళి ,
రామ్ గోపాల్ వర్మ ముఖ్య పాత్రలలో నటించారు.