బాహుబలితో మొదటి 1000 కోట్ల పాన్
ఇండియా స్టార్ గా మారిన
ప్రభాస్ తాజాగా నటించిన
కల్కి 2898ఏడీ
సినిమా నిన్న గ్రాండ్ గా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేస్తూ
ప్రభాస్ కి
బాహుబలి లాంటి బిగ్గెస్ట్ కం బ్యాక్ హిట్ ఇచ్చింది.
కల్కి 2898 ఏడీ
మూవీ ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది.విడుదలకి ముందు ఈ సినిమాకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయిన ట్రైలర్ చూసాకా ఊహించని స్థాయిలో హైప్ అయితే క్రియేట్ అయ్యింది. అందువల్ల ఈ సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మొదటి మూడు రోజులకి చాలా చోట్ల థియేటర్స్ అన్ని కూడా
హౌస్ ఫుల్ అయిపోయాయి. రెండు ట్రైలర్స్ తోనే ఈ
సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందనేది
డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆడియన్స్ కి చూపించాడు. దీంతో
కల్కి సినిమా చూడాలనే ఇంటరెస్ట్ అందరిలో పెరిగింది.. మొత్తానికి
బ్లాక్ బస్టర్ టాక్ తో ఫస్ట్ రోజు 191.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది ఈ సినిమా.
నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సీనియర్
నిర్మాత అశ్వినిదత్ ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,
దీపికా పడుకొనే,
దిశా పటాని ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో భైరవ పాత్రలో సూపర్ హీరోగా నటించాడు. ఇక
దీపికా పదుకునే కల్కికి జన్మనివ్వబోయే సుమతిగా నటించింది. కథ మొత్తం దీపికని కాపాడటం చుట్టు తిరుగుతుంది. మూడు గంటల నిడివి ఉన్న కూడా అదిరిపోయే విజువల్స్ తో ప్రేక్షకులని ఈ చిత్రం కట్టిపడేస్తోంది. కచ్చితంగా ఈ ఏడాది
ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చే బిగ్గెస్ట్
బ్లాక్ బస్టర్ గా
కల్కి నిలుస్తుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ
సినిమా విజువల్స్ నుంచి యాక్షన్ ఎపిసోడ్స్, స్టోరీ అంతా ఎంతగానో అబ్బురపరుస్తున్నాయి. ఇంకా ఈ సినిమాకి రికార్డు స్థాయిలో
టికెట్స్ బుక్ అవుతున్నాయి.
కల్కి దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా ఇంకో వారంలోనే చాలా ఈజీగా 1000 కోట్ల వసూళ్లు రాబట్టేటట్లు ఉంది. ఈ సినిమాతో తెలుగోడి పవర్ ఏంటో మరోసారి ప్రపంచానికి అర్ధం అయ్యింది.