కల్కి 2898AD: కల్కి రికార్డుని ఈ సినిమాలు బ్రేక్ చేస్తాయా..?
జూలై నెలలో భారతీయుడు-2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. అయితే రీసెంట్గా విడుదలైన ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోలేకపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇండియన్-2 సినిమాతో మిస్ అయిన శంకర్ ఈ ఏడాది రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజెర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చేలా ప్లాన్ చేశారు. ఇది కూడా భారీ బడ్జెట్ సినిమా కావడం గమనార్హం. మరి భార్య రికార్డులను టార్గెట్ చేస్తూ ఈ రెండు చిత్రాలు బరిలోకి దిగబోతున్నాయి.
డైరెక్టర్ కొరటాల శివ, దేవర సినిమాని తేరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటిస్తూ ఉండగా.. హీరోయిన్ల బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు గత రికార్డులను సైతం దేవర తిరగరాస్తుందనే విధంగా తెలియజేస్తున్నారు. ఈ సినిమా 27-9-24 విడుదల కాబోతోంది. టాలీవుడ్ లో మోస్ట్ అవైడడ్ చిత్రంగా పేర్కొంది పుష్ప-2 ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. ఆల్రెడీ పుష్ప సినిమాతో సరికొత్త రికార్డులను తిరగ రాసిన అల్లు అర్జున్ మరి పుష్ప-2 చిత్రంతో ఎలాంటి రికార్డులు తిరగ రాస్తారు అనే విషయం ఇప్పుడు సుకుమార్ మీద ఆధారపడినట్లు తెలుస్తోంది. కల్కి చిత్రాల రికార్డులను విచిత్రాలు తిరగ రాస్తాయో లేదో చూడాలి.