రెబల్ స్టార్
ప్రభాస్ తాజాగా
కల్కి 2898 AD అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ
మూవీ కి
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ
సినిమా జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజే బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ
మూవీ కి మొదటి రోజు నుండే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఆ మూడు రోజుల్లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి.
ఇకపోతే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో వచ్చిన గ్రాస్ కలెక్షన్లకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేస్తుంది. ఈ
పోస్టర్ ప్రకారం ఈ
సినిమా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 415 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఈ రోజు హాలిడే కావడంతో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కే అవకాశం ఉంది. మరి ఈ రోజుతో ఈ
సినిమా 500 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మరి ఈ రోజు ఈ సినిమాకు ఏ స్థాయి కలెక్షన్లు వస్తాయో చూడాలి.