అనిల్ రావిపూడి ఇచ్చిన మాటమీద నిలబడేనా?
మీడియా సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వెంకీ, అనిల్ రావిపూడి కాంబో మూవీ ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో మొదలయ్యే సూచనలు కనబడుతున్నాయి. కేవలం 5 నెలల సమయంలో సినిమా పూర్తి చేసి 2025 సమ్మర్ సినిమా రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ అనిల్ రావిపూడి ఎప్పుడు ప్రారంభించినా వచ్చే సంక్రాంతికి సినిమాని విడుదల చేస్తే బావుంటుందని అనుకుంటున్నాడట. సంక్రాంతి కలిసి వచ్చే సీజన్ కాబట్టి అస్సలు వదులుకోవద్దని దర్శకుడు మరియు నిర్మాత దిల్ రాజు కూడా భావిస్తున్నారు.
అయితే ఇంకా షూటింగ్ ప్రారంభం కాని సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం అంటే సాధ్యమేనా? అని వెంకీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. కాగా అనిల్ మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ తోనే సినిమాను అతి తక్కువ సమయంలో పూర్తి చేసి అందరికీ ఆశ్చర్యపరిచాడు. అదేవిధంగా భగవంత్ కేసరి సినిమాకు కూడా చాలా తక్కువ సమయం తీసుకున్నాడు రావిపూడి రావిపూడి. కాబట్టి వెంకీ మామ తో చేయబోతున్న సినిమాను కూడా కేవలం 100 రోజుల లోపులోనే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని అనిల్ గురించి తెలిసినవారు అంటున్నారు. కనుక సంక్రాంతికి వెంకీ, అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ విషయంలో డౌట్ అసలు అక్కర్లేదన్నట్టుగా తెలుస్తోంది.