టేలర్ స్విఫ్ట్ కాన్సర్ట్‌లో మెరిసిన మహేష్ ముద్దులు కూతురు సితార!
సితార స్టాండ్స్ లో బిగ్గరగా అరుస్తూ ఉత్సాహంగా పాడటాన్ని నమ్రత కెమెరాల్లో బంధించింది. తరువాత ఆ ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... తన కుమార్తె టేలర్ స్విఫ్ట్ కి పెద్ద అభిమాని అని.. పాప్ సింగర్ మ్యూజిక్ ఆల్బమ్‌లను కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటుందని వెల్లడించింది. అంతేకాకుండా నా కుమార్తె టేలర్‌ను ప్రేమిస్తుంది! నేను నా కుమార్తెను ప్రేమిస్తున్నాను.. కాబట్టి నేను టేలర్‌ని ప్రేమిస్తున్నాను... అంటూ నమ్రత తన ప్రేమను చాటుకుంది. చివరగా టేలర్ స్విఫ్ట్ ప్రదర్శన అద్భుతంగా ఉంది అని నమ్రత పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో వారి ఫోటోలను చూసిన ఘట్టమనేని అభిమానులు ఫుల్ ఖుషీలో మునిగిపోయారు అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో వారు సితారకి లవ్ ఎమోజిస్ ప్రేమగా పంపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొందరు ప్రేమగా తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేసారు. వారిలో ఒకరు ''అమ్మ తన కుమార్తె ఆనందాన్ని రికార్డ్ చేస్తోంది'' అంటూ వ్యాఖ్యానించగా, మరికొంతమంది ప్రిన్స్ మహేష్ బాబు లాగే సితార కూడా ఎంతో అందమైనది... ఆనందం కలది అంటూ వ్యాఖ్యానించారు. ఇకపోతే నమ్రత శిరోద్కర్ -మహేష్ బాబుల కుమారుడు గౌతమ్ ఇటీవల తన మొదటి థియేట్రికల్ ప్రదర్శనను లండన్‌లో ప్రదర్శించడం జరిగింది. ఆ సమయంలో కూడా సితార - నమ్రత ఫోటోలు అంతర్జాలంలో వైరల్ కావడం అందరికీ తెలిసిందే. అయితే ఆ ఫంక్షన్ కి మహేష్ హాజరు కాగా తాజా షోకి మాత్రం హాజరు కాలేకపోయారు. ఎందుకంటే మహేష్ ఇపుడు రాజమౌళి సినిమాకోసం సన్నద్ధం అవుతున్నారు.