తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో
నాని ఒకరు. ఈయన సినీ పరిశ్రమలోకి ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి , ఆ తర్వాత ఒక్కో విజయాన్ని అందుకుంటూ ప్రస్తుతం
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన
హీరో స్థాయికి ఎదిగారు. ఈ నటుడు పోయిన సంవత్సరం మొదటగా
దసరా అనే పక్కా
మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత హాయ్
నాన్న అనే క్లాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకున్నాడు.
ప్రస్తుతం
నాని ,
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ
మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ
మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే
నాని కొంతకాలం క్రితం బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వేణుతో , అలాగే
సుజిత్ దర్శకత్వంలో చలో
మూవీ చేయడానికి రెడీ అయ్యారు. కాకపోతే
సుజిత్ , నానితో అనుకున్న మూవీకి బడ్జెట్ బాగా ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ
మూవీ క్యాన్సిల్ అయినట్లు వార్తలు వచ్చాయి.
ఇక బలగం వేణు చెప్పిన కథ
నాని ఇది వరకు చేసిన దసర సినిమాకు దగ్గరగా ఉండడంతో ఆ
మూవీ ని కూడా
నాని రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే సరిపోదా శనివారం
సినిమా చివరి దశకు వచ్చిన సమయంలో
నాని తాజాగా ఓ క్రేజీ దర్శకుడితో
మూవీ ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో
నాని తన తదుపరి
మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం
నాని ,
శేఖర్ ఇద్దరు కథా చర్చలు జరుపుతున్నట్లు ఒక వేళ
శేఖర్ చెప్పిన కథ నానికి నచ్చినట్లయితే ఈ కాంబోలో
మూవీ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.