కల్కికి భయపడి వెనక్కి పారిపోతున్న
బాలీవుడ్ స్టార్ మూవీస్?
ప్రభాస్ రీసెంట్ గా నటించిన
కల్కి 2898 AD సినిమాకి వరల్డ్ వైడ్ గా సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. 5 రోజుల్లో ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వచ్చేసాయి.
కల్కి కథను
సిల్వర్ స్క్రీన్ పై గొప్పగా ఆవిష్కరించాడు నాగ్ అశ్విన్.
ప్రభాస్,
అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ పాత్రలను ఆయన తీర్చిదిద్దిన తీరు చాలా గొప్పగా ఉంది. హిందీలో కూడా ఇప్పటికే
కల్కి సినిమా వసూళ్లు రూ. 128 కోట్లకి పైగా నెట్ వసూళ్లని దాటేశాయి. నార్త్ అమెరికాలో 110 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇక ఈ వారం కూడా నిలకడగా వసూళ్లు రాబడితే ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ ని ఈజీగా దాటే అవకాశం ఉంటుంది.
బాలీవుడ్ లో మాత్రం
ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మ రథం పడుతున్నారు.ఈ
సినిమా వల్ల
బాలీవుడ్ లో నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న సినిమాలు మూడు.. విడుదలను వాయిదా వేసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది..
కల్కి కి వస్తున్న పాజిటివ్ టాక్ తో పాటు కలెక్షన్ల సునామిని చూసి ఏకంగా ఓ బడా స్టార్
హీరో తన
సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది.. ఆ
హీరో మరెవ్వరో కాదు.. అతనే
అజయ్ దేవగన్.. ఈయన ఇంకా టబు ప్రధాన పాత్రల్లో నటించిన
సినిమా ‘ ఔరోన్ మెయిన్ కహన్ దుం తా ‘. అయితే ఈ సినిమాను మొదట
కల్కి రిలీజైన వారం తర్వాత రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాకు స్టార్
డైరెక్టర్ నీరజ్ పాండే దర్శకత్వం వహించారు.. ఫ్రైడే ఫిలిం వర్క్స్, ఎన్ హెచ్ స్టూడియోజ్ ఈ మూవీని నిర్మించారు..కానీ ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాను మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తుంది..
కల్కి ఎఫెక్ట్ ఇండస్ట్రీలో బాగా పడుతుంది.. ఈ
సినిమా దెబ్బతో మిగిలిన వాయిదా కావాల్సిన సినిమాలు సైతం విడుదల తేదీలను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది.. ఇక
కల్కి సినిమా విజువల్ వండర్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇక కలెక్షన్స్ కూడా ఓ రేంజులో రాబడుతుంది..